శనివారం నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ శనివారం నుండి స్టార్ట్ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఇండియా టీం గ్రూప్-ఎ లో ఉండగా పాకిస్థాన్, పసికూన హాంకాంగ్ జట్ల తో ఒక్కో మ్యాచ్‌ని ఇండియా ఆడనుంది. అయితే మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటల కి స్టార్ట్ అవ్వనున్నాయి. ఫస్ట్ మ్యాచ్‌ని పాకిస్థాన్ తో ఆదివారం ఇండియా ఆడనుంది.
ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 11న దుబాయ్‌లోనే అవ్వనుంది. బుధవారం అయితే హాంకాంగ్‌తో రెండో మ్యాచ్‌ని టీమిండియా ఆడనుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెప్టెంబరు 3 నుంచి జరగనున్న సూపర్-4 లో భారత్ జట్టు ఆడనుంది. ఇక టీమ్ వివరాలను చూస్తే… 15 మందితో ఆసియా కప్ కి టీమ్ ఇండియా సిద్ధం అయ్యింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ని భారత సెలెక్టర్లు సెలెక్ట్ చేసారు.
టీమ్ వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్)
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్)
విరాట్ కోహ్లి
సూర్య కుమార్ యాదవ్
దీపక్ హుడా
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్)
హార్దిక్ పాండ్య
రవీంద్ర జడేజా
రవిచంద్రన్ అశ్విన్
యుజ్వేంద్ర చాహల్
రవి బిష్ణోయ్
భువనేశ్వర్ కుమార్
అర్షదీప్ సింగ్
అవేష్ ఖాన్