Maxwell: తప్పతాగి ఆస్పత్రి పాలైన మాక్సీ..!

-

RCB ప్లేయర్‌, ఆస్ట్రేలియన్ విద్వాంసకర ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కు ఊహించని షాక్‌ తగిలింది. క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండా ఓ సంగీత కచేరీలో పాల్గొన్న మ్యాక్స్వెల్ అక్కడ పీకల దాకా తాగి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సిరియస్ గా తీసుకుని దీనిపై విచారణ ప్రారంభించింది.

australia star all rounder glenn maxwell admitted in hospital

శుక్రవారం (జనవరి 19) ఆడిలైడ్ లో ఓ సంగీత కచేరి జరగ్గా….మాక్స్వెల్ అందులో పాల్గొన్నాడు. అక్కడ అతిగా మద్యం సేవించడంతో అతని ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను కుదురుగా ఉండలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వెంటనే అక్కడినుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. పైగా ఏమీ ఎరగనట్టు మరుసటి రోజు శిక్షణకు హాజరయ్యాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. ఆడిలైడ్ లో జరిగిన సంగీత కచేరీలో మ్యాక్స్వెల్ సంఘటన గురించి తమకు తెలిసిందని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news