టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్లు తమ జోరు ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇవాళ ఓ రజత పతకం రాగా.. తాజా గా భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. మహిళ షూటర్ అవని లేఖారా ఎయిర్ రైఫిల్ విభాగం లో కాంస్య పతకాన్ని గెలిచింది.
మహిళల 50 మీ రైఫిల్ విభాగం లో అవని లేఖరా కాంస్య పతకం సాధించింది. దీంతో ఇక మన భారత ఖాతాలో మొత్తం పతకాల సంఖ్య 12 కు చేరింది. ఇందులో 2 గోల్డ్ పతకాలు ఉండగా… 6 సిల్వర్ మరియు 4 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. కాగా… ఇవాళ ఉదయం పురుషుల హైజంప్ లో భారత్ కు సిల్వర్ పతకం దక్కింది. పురుషుల హైజంప్ లో భారత క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంపు చేసి ఈ రజత పతకాన్ని సాధించాడు. దీంతో హై జంపు లో భారత్ కు ఇది నాలుగో పతకం కాగా ఇంతకు ముందు 3 రజత పతకాలు భారత్ కు వచ్చాయి.