డ్ర‌గ్స్ కేసు : ర‌కుల్ మ్యానేజ‌ర్ తో న‌వ‌దీప్ మ్యానేజ‌ర్ కు సంబంధాలు..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈరోజు 10గంట‌ల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ విచార‌ణ‌కు హాజ‌రైంది.
ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ విచార‌ణ కొన‌సాగుతోంది. ఈడీ విచార‌ణ‌లో నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో రకుల్ ప్రీత్ సింగ్ క్ల‌బ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో ర‌కుల్ పేరు ఉన్న‌ట్టు గుర్తించారు. రకుల్ ప్రీత్‌సింగ్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహారం పై విచార‌ణ జ‌రుగుతోంది. నవదీప్ ద్వారా క్లబ్ మేనేజర్ డ్ర‌గ్స్ సరఫరా చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఇక ఇప్పటికే నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు ఈడీ నోటీసులు పంపింది.

ఎఫ్ క్లబ్ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు డబ్బులు బదిలీచేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఎఫ్ క్లబ్‌లో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేసిన‌ట్టు ఈడీ నిర్ధారించింది. నవదీప్ ఎఫ్ క్లబ్ లో జ‌రిగిన పార్టీల‌కు రకుల్, రానా లు హాజ‌రైన‌ట్టు గుర్తించారు. అందువ‌ల్లే ఎక్సైజ్‌శాఖ కేసులో లేని రానా, రకుల్ ప్రీత్‌సింగ్ పేర్లు లేక‌పోయినా సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఈడీ నోటీసులు పంపింది.