BCCI: ఆసియా కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

BCCI: ఆగస్టు చివరివారం నుండి క్రికెట్ ఫీవర్ మొదలుకానుంది. 2023 ఆగస్టు 30 నుండి ఆసియా కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో నేపాల్ తో తలపడనుంది పాకిస్తాన్. ఆ తర్వాత సెప్టెంబర్ రెండవ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. అయితే తాజాగా బిసిసిఐ భారత జట్టు టీమ్ ని ప్రకటించింది.

17 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (wc), జడేజా, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ, అలాగే సంజు శాంసన్ ని బ్యాకప్ ప్లేయర్ గా ఎంపిక చేసింది. ఈ జట్టులో ఇద్దరు హైదరాబాదీలకు (మహమ్మద్ సిరాజ్, తిరక్ వర్మ) చోటు కల్పించింది బీసీసీఐ.

Read more RELATED
Recommended to you

Latest news