బాబుకు ఉద్యోగులు యాంటీ..జగన్ దెబ్బ అదుర్స్.!

-

ఎందుకో తెలియదు గాని..మొదట నుంచి ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు పట్ల కాస్త వ్యతిరేకత భావనతోనే ఉంటారు. అనవసరమైన పనులు, హడావిడి చేస్తూ…అర్ధరాత్రిల వరకు మీటింగులు అంటూ బాబు అధికారంలో ఉన్నప్పుడు చేసే హడావిడి అందరికీ తెలిసిందే. అందుకే ఉద్యోగులు బాబు పట్ల వ్యతిరేకతతోనే ఉంటారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులతో ఫ్రెండ్లీ నేచర్ తో పనిచేయిస్తున్నారు.

వారికి కావల్సిన హామీలని నెరవేరుస్తూ ముందుకెళుతున్నారు. కానీ కొన్ని ఆర్ధికమైన అంశాల విషయంలో కాస్త ఉద్యోగులకు అనుకున్న మేర పనులు చేయలేకపోయారు. అయినా ఎక్కడ కూడా వారికి అన్యాయం మాత్రం చేయలేదు. కానీ జగన్ పై ఉద్యోగుల్లో ద్వేషం పెరిగేలా చేసి లబ్ది పొందాలనేది బాబు ప్లాన్..ఇక బాబు ప్లాన్‌కు జగన్ చెక్ పెడుతూ ముందుకెళుతున్నారు. తాజాగా ఏపీఎన్జీవో రాష్ట్ర మహాసభలకు హాజరైన జగన్..బాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇచ్చాడు కానీ, 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అమ్మేశారని మండిపడ్డారు.

చంద్రబాబు రాసిన మనసులో మాట చదవండని, రాష్ట్రంలోని ఉద్యోగాలు 40. 62 శాతం అదనంగా ఉన్నాయని చంద్రబాబు రాశారని, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిపై మవసులో మాట పుస్తకంలో రాశారని,వారంతా లంచకోరులే అన్నట్లు చెప్పడానికి బాబు ఎవరు అని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వంతో పోల్చినా తమ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని తెలిపారు.

1 లక్ష 35 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. కమిట్ మెంట్ తప్పు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గ్యారెంటీ స్కీం తీసుకొచ్చామని తెలిపారు. మొత్తానికి ఉద్యోగులు మళ్ళీ వైసీపీకే మద్ధతు ఇచ్చేలా జగన్..బాబుకు చెక్ వ్యూహాలకు చెక్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news