టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్‌..ఐపీఎల్‌ వద్దంటూ !

-

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చింది. ఐపీఎల్ కోసం ఎదురు చూస్తూ దేశవాలీలకు దూరంగా టైంపాస్ చేస్తున్న ఆటగాళ్లకు బీసీసీఐ హుకుం జారీచేసింది. జాతీయ జట్టుతో లేనివారు, జాతీయ క్రికెట్ అకాడమీలో లేని ఆటగాళ్లందరూ వెంటనే తమ రంజీ జట్లతో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.

BCCI warning to Team India cricketers

ఈ మేరకు ఆటగాళ్లకు బోర్డు మెయిల్ చేసినట్లు సమాచారం. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్ వంటి ఐపీఎల్ స్టార్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు దూరంగా ఉంటుండటం గమనార్హం. కాగా టీం ఇండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నెట్స్ లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్ కు దూరం అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ కు, ఆ తర్వాత టీం ఇండియాలో రానున్నారు. కాగా, తన రికవరీ గురించి పంత్ ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news