బిగ్ బ్రేకింగ్; ఐపిఎల్ వాయిదా, ఎప్పుడంటే…!

-

భారత్ లో ఎంతో క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపిఎల్ ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వాయిదా వేసింది. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్ళ వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అప్పటి వరకు. విదేశీ ఆటగాళ్ళు లేకపోతే టోర్నీ కి కళ ఉండదని, అదే విధంగా భారీగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ముందు నుంచి కూడా కరోనా దెబ్బకు అసలు ఐపిఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బోర్డ్ అధ్యక్షుడు గంగూలీ… ఐపిఎల్ ని నిర్వహించడం ఖాయమని పలు మార్లు స్పష్టంగా చెప్పినా కరోనా ఉంది కాబట్టి నిర్వహించడం అనుమానమే అనే వార్తలు వచ్చాయి. కరోనా దెబ్బకు ఈ ఏడాది రద్దు చేయలేదు గాని వాయిదా వేసారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి జరగనున్నాయి.

దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు వాయిదా వేసారు కాబట్టి ఏప్రిల్ 15 నుంచి విదేశీ ఆటగాళ్లకు తమ దేశాల సొంత మ్యాచులు ఉంటాయి. మరి అప్పుడు ఆడతారా లేదా అనేది తెలియదు. త్వరలోనే కొత్త షెడ్యుల్ ని విడుదల చేయనున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు టోర్నీలను కూడా రద్దు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news