కోహ్లీలో మూడు లక్షణాలు చెప్పిన బ్రెట్ లీ…!

టీం ఇండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసాధారణ క్రికెట్ విజయాలను అధిగమించడానికి గానూ ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రతిభ, ఫిట్నెస్ మరియు మానసిక సామర్థ్యం లభించాయని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. తాజాగా మాట్లాడిన లీ కీలక వ్యాఖ్యలు చేసాడు. తాము ఇక్కడ అసాధారణ సంఖ్యల గురించి మాట్లాడుతున్నామని… ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల క్రికెట్ లో ఇద్దరి మధ్య వ్యత్యాసం ప్రస్తావిస్తూ..

విరాట్ కోహ్లీ వెళుతున్న రేటుతో చూస్తే అతను కచ్చితంగా సచిన్ సాధించిన విజయాలను అందుకుంటాడు అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ ఘనతను సాధించడంలో కోహ్లీకి సహాయపడే మూడు అంశాలను లీ ప్రస్తావించాడు. మీరు బ్యాట్స్ మాన్ ప్రతిభ గురించి మాట్లాడుతారు, అతనికి ఖచ్చితంగా ఆ ప్రతిభను ఉందని అన్నాడు. ఫిట్‌నెస్ విరాట్ కోహ్లీకి ఆ ఫిట్‌నెస్ వచ్చిందని అన్నాడు.

కాబట్టి 30 ఏళ్ళ వయసులో ఫిట్‌నెస్ చాలా కీలకమని అన్నాడు. అలాగే మానసిక బలంతో పాటుగా… కష్ట సమయాల్లో ముందుకి వెళ్ళే మానసిక సామర్థ్యం, ఇంటి నుండి దూరంగా ఉండటం , అతని భార్య నుండి కూడా దూరంగా ఉండాలి. పిల్లలు పుట్టినా దూరంగా ఉండాలని చెప్పాడు. అతను తన ప్రతిభతో సులభంగా విజయాలను నమోదు చేస్తాడని అన్నాడు. ఫిట్ గా ఉంటే సచిన్ రికార్డ్ లను అధిగమించడం పెద్ద కష్ట౦ కాదని అన్నాడు.