భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన

-

ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా T20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే జింఖానా మైదానం వద్ద క్యూ కట్టారు. కొంతమంది వేరే ఊళ్ల నుంచి వచ్చి మరీ టికెట్ల కోసం క్యూలో వేచి చూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఎదురుచూస్తున్నా.. టికెట్లు మాత్రం ఇవ్వడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారని క్రికెట్‌ అభిమానులు ఆరోపించారు. మూడు రోజులుగా తాము జింఖానా మైదానానికి టికెట్లు కోసం వస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంటి ఎలాంటి స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్​లైన్ ద్వారా టికెట్​ బుక్ చేసుకున్నా తిరిగి రీ ఫండ్ చేస్తున్నారని , 55 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్ మైదానంలో బ్లాక్​లో టికెట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో తాము ఇక్కడికి వచ్చామని అభిమానుల మనోభావాలు దెబ్బతిని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వందల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news