2007 సిడ్నీ టెస్ట్ ‘మంకీగేట్’ఉదంతం మళ్లీ రిపీట్ అయిందా

-

టీమిండియాపై ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. బుమ్రా, సిరాజ్‌ బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు.. వారిని కొందరు ఆసీస్‌ ఫ్యాన్స్‌ తిట్టారు. దీనిపై టీమిండియా అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో.. క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఐసీసీ విచారణ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇదే సిడ్నీ గ్రౌండ్ లో 2007లో జరిగిన ‘మంకీగేట్’ ఉదంతం మళ్లీ తెర పైకి వచ్చింది.

సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌×ఆసీస్‌ మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ ఓవరాక్షన్‌ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియా బోర్డు అధికారులు సిరాజ్‌తో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. శనివారం ఆట ముగిసిన తర్వాత టీమిండియా సారథి అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్‌ కూడా ఈ విషయంపై అంపైర్లు పాల్‌ రీఫెల్‌, విల్సన్‌కు తెలియజేశారు.

దీనిపై ఐసీసీ పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై టీమిండియా యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. మద్యం తాగిన ఓ ఆసీస్‌ అభిమాని.. సిరాజ్‌ను ‘కోతి’ అని పిలిచాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2007 సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీగేట్’ ఉదంతాన్ని గుర్తుచేయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాయి. అప్పుడు హర్భజన్‌ సింగ్‌ తనని కోతి అని పిలిచాడని సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని భజ్జీ వివరణ ఇచ్చాడు.

ఇక రేసిజం ఘ‌ట‌న‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. సంబంధిత అభిమానుల‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. టీమిండియాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి.. దానిని ట్విట‌ర్లో పోస్ట్ చేసింది. బాధ్యుల‌ను గుర్తించిన త‌ర్వాత వేధింపుల నిరోధ‌క కోడ్ ప్రకారం వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. దీర్ఘ‌కాలం నిషేధం, మ‌రిన్ని ఆంక్ష‌లు, న్యూసౌత్‌వేల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం లాంటివి చేస్తాం అని తెలిపింది.

సిరీస్‌కు ఆతిథ్య‌మిస్తున్న వ్య‌క్తులుగా మేము మా ఇండియ‌న్ క్రికెట్ స్నేహితుల‌కు క్ష‌మాప‌ణ కోరుతున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news