ఇండియా క్రికెట్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్…!

-

నవంబర్ నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం టెలివిజన్ హక్కులే అని తెలుస్తుంది. ఫోక్స్‌ టెల్‌ తో పాటు ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రసార హక్కులను కలిగి ఉన్న సెవెన్ వెస్ట్ మీడియా, క్రికెట్ ఆస్ట్రేలియాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడం ప్రారంభించింది. సెవెన్ వెస్ట్ మీడియా అనేది స్టార్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా లేదా స్కై స్పోర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ లాంటి అగ్ర సంస్థ.India vs Australia 2020 ODI series: Live streaming, telecast details,  fixtures and squads

ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాన ప్రసారకులుగా ఉన్నారు. సెవెన్ వెస్ట్ మీడియా 1.19 బిలియన్ డాలర్ల విలువైన ఆరు సంవత్సరాల ప్రసార ఒప్పందాన్ని కొనుగోలు చేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా 25 మిలియన్ల ఆస్త్రేలియన్ డాలర్ల అడ్వాన్స్ ను చెల్లించలేము అని చెప్పారు. దీనితో ఇప్పుడు సదరు సంస్థ వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే సీరీస్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news