క్రికెట్: 69ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును నెలకొల్పిన భారత ఓపెనర్లు..

-

లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండవ టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు. లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.

ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version