బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీకి కరోనా సోకడంతో కోల్కత్తలోని ఒక ఆస్పత్రికి వెళ్లాడు. ఓమిక్రాన్ అనుమానంతో సౌరవ్ గంగూలీ శాంపిల్స్ ను జీనోమ్ సిక్వెన్సింగ్ కు రెండు రోజుల క్రితం పంపించారు. జీనోమ్ సిక్వెన్సింగ్ కు పంపిన శాంపిల్స్ రిపోర్ట్ నిన్న రాత్రి వచ్చింది. ఈ రిపోర్ట్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి డెల్టా ప్లస్ సోకిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హోం ఐసోలేషన్ లో సౌరవ్ గంగూలీ డెల్టా ప్లస్ కు చికిత్స తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
సౌరవ్ గంగూలీ కి కరోనా పాజిటివ్ వచ్చిన నాటి నుంచే హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. కాగ కరోనా నుంచి రూపంతరం చెందిన ప్రమాదకరమైన వేరియంట్లలో డెల్టా ప్లస్ ఒకటి. డెల్టా ప్లస్ కేసులు మన దేశంలో పెద్దగా వెలుగు చూడలేదు. కానీ అమెరికాతో పాటు మరి కొన్ని దేశాలను డెల్టా ప్లస్ వణికించింది. ఈ వేరియంట్ తో రోజుకు వేల సంఖ్యలు కేసులు వచ్చాయి. అయితే సౌరవ్ గంగూలీ రెండు డోసుల టీకాలు తీసుకున్నందున ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.