ఇండియాతో వ‌న్డే సిరీస్.. టీమ్‌ను ప్ర‌క‌టించిన ఇంగ్లండ్‌..!

Join Our Community
follow manalokam on social media

భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య తాజాగా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ముగిసిన విష‌యం విదిత‌మే. ఈ సిరీస్‌ను 3-2 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది. కాగా ఈ నెల 23వ తేదీ నుంచి ఇరు దేశాల మ‌ధ్య 3 వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సిరీస్‌కు గాను ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ ప్లేయ‌ర్లు జోఫ్రా ఆర్చ‌ర్‌, జో రూట్‌, క్రిస్ వోక్స్‌ల‌కు ఆ జ‌ట్టులో స్థానం ల‌భించ‌లేదు.

england squad announced for three match odi series against india

మార్చి 23వ తేదీ నుంచి భార‌త్‌తో ప్రారంభం కానున్న 3 వ‌న్డేల సిరీస్‌కు ఇంగ్లండ్ 14 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ మోచేయి గాయం కార‌ణంగా సిరీస్‌లో పాల్గొన‌డం లేదు.

ఇక రొటేష‌న్ ప‌ద్ధ‌తి ప్రకారం జో రూట్‌, క్రిస్ వోక్స్‌ల‌కు ఈ సిరీస్ జ‌ట్టు‌లో చోటు క‌ల్పించ‌లేదు. వీరిద్ద‌రికీ ఇటీవ‌ల జ‌రిగిన 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ స్థానం ల‌భించ‌లేదు.

భార‌త్ తో వ‌న్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జ‌ట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, శామ్ బిల్లింగ్స్, జాస్ బ‌ట్ల‌ర్‌, శామ్ కుర్రాన్‌, టామ్ కుర్రాన్, లివ్‌స్టోన్‌, పెర్కిస్స‌న్‌, ఆదిల్ ర‌సీద్‌, జేస‌న్ రాయ్‌, బెన్ స్టోక్స్‌, మార్క్ వుడ్‌, రేసీ టాప్లీ.

ఇండియా, ఇంగ్లండ్‌ల మ‌ధ్య 3 వ‌న్డేలు పూణెలోనే జ‌రగ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్ 23న‌, రెండో మ్యాచ్ 26న‌, మూడో మ్యాచ్ 28న జ‌రుగుతుంది. దీంతో ఇంగ్లండ్ ఇండియా టూర్ ముగుస్తుంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...