ఐపీఎల్ లోకి మ‌ళ్లీ అడుగు పెడుతున్న గంభీర్

గౌత‌మ్ గంభీర్ టీమిండియా కే కాకుండా ఐపీఎల్ లో కూడా మంచి రికార్డులు ఉన్నాయి. కోల్‌క‌త్త నైట్ రైడర్స్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న స‌మ‌యం లో రెండు సార్లు 2012, 2014 ల‌లో క‌ప్పు తీసుకువ‌చ్చాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఐపీఎల్ కు గ‌త కొద్ది సీజ‌న్ ల నుంచి దూరం గా ఉంటున్నాడు. అయితే వ‌చ్చే ఏడాది రాబోతున్న ఐపీఎల్ 2022 కి గౌత‌మ్ గంభీర్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అయితే ఈ సారి గంభీర్ ప్లేయ‌ర్ గా కాకుండా మెంటార్ గా మైదానం లోకి అడుగు పెట్ట‌బోతున్నాడు.

ఐపీఎల్ కు కొత్త గా వ‌చ్చిన ల‌క్నో జట్టు గౌత‌మ్ గంభీర్ ను మెంటార్ నియ‌మించింది. దీంతో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ కు గౌత‌మ్ గంభీర్ మెంటార్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్నాడు. అయితే లక్నో జ‌ట్టు ఐపీఎల్ 2022 కి స‌ర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇప్ప‌టి కే ఆ జ‌ట్టు కు ప్ర‌ధాన కోచ్ గా ఆండీ ఫ్ల‌వ‌ర్ ను ఎంపిక చేసింది. అలాగే కెప్టెన్ గా కే ఎల్ రాహుల్ ను తీసుకోవ‌డానికి సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. అలాగే ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచ‌ల‌నం ర‌షీద్ ఖాన్ కూడా జ‌ట్టు లోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.