4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ తర్వాత భారత్ కు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావాలని తీసుకున్న నిర్ణయం చాలా మంది ఆందోళనకు గురిచేసింది. విరాట్ కోహ్లీ టీం ఇండియాకు ప్రధాన బలం అనే సంగతి తెలిసిందే. 32 ఏళ్ల కోహ్లీ… అడిలైడ్ టెస్ట్ తర్వాత తిరిగి ఇండియా వస్తాడు. అయితే దీనిపై టీం ఇండియా దిగ్గజ ఆటగాడు హర్భజన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ లేకపోవడాన్ని జట్టు అవకాశంగా చూడాలని బజ్జీ చెప్పాడు.
ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్… భారత టెస్ట్ జట్టులో తిరిగి రాబోతున్న కెఎల్ రాహుల్ వంటి బ్యాట్స్ మాన్ కి తన కెప్టెన్ లేకపోవడంతో… మంచి అవకాశం వస్తుంది అని, తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు అని, కెఎల్ రాహుల్, చేతేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం అని చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనింగ్ పెద్ద విషయమేనని పేర్కొన్నాడు.