ఆ తప్పు చేయకపోయుంటే మ్యాచ్ ఓడిపోయేవాళ్ళమే కాదు.. ఇంగ్లండ్ కెప్టెన్

అహమ్మాదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో ఇండియా- ఇంగ్లండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మరీ రెండు రోజుల్లోనే ముగియడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు రోజుల్లోనే నాలుగు ఇన్నింగ్సులు పూర్తయ్యి ఇంగ్లండ్ పై ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మైదానంలో స్పిన్నర్లే తన హవా చూపించారు. మనవైపేమో అక్షర్ పటేల్, అశ్విన్ విజృంభించారు. అటు వైపు రూట్ ఎక్కువ వికెట్లు అందుకున్నాడు.

ఐతే ఈ విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఒకానొక విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. పింక్ బాల్ టెస్ట్ అనేసరికి గతంలో అడినట్టుగా అనుకుని, ముగ్గురు పేసర్లని టీమ్ లోకి తీసుకున్నాం. అలా చేయడం వల్లే మ్యాచ్ లో ఓడిపోయాం. అలా చేయక, మరో స్పిన్నర్ ని జట్టులోఖి తీసుకుంటే వేరేలా ఉండేదని, ప్రస్తుతం జరగబోయే నాలుగవ టెస్టులో స్పిన్నర్ గా డామ్ బెస్ జట్టులోకి వస్తాడని అన్నారు. మరి నాలుగవ టెస్టులో మ్యాచ్ ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి. ఈ మ్యాచ్ కూడా అహమ్మదాబాద్ లోనే జరగనుంది.