T20 World Cup : బంగ్లా​పై టీమ్ ఇండియా విజయం..సెమీస్ బెర్త్ ఫిక్స్

-

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన కీలక పోరులో టీమ్ ​ఇండియా ఘనవిజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమ్ ఇండియాకు సెమీస్ బెర్త్ కన్ఫమ్ అయినట్టైంది. ఈ మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. కొద్దిరోజులుగా ఫేడ్ అవుట్ అయిన కేఎల్ రాహుల్ ఇవాళ్టి మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

వర్షం కారణంగా భారత జట్టు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని 151 రన్స్​కు కుదించినా బంగ్లాదేశ్​ ఛేదించలేకపోయింది. లిట్టన్​ దాస్​(60:27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) సూపర్​ ఇన్నింగ్స్ ఆడి టాప్​ స్కోరర్​గా నిలిచాడు​. టీమ్ ​ఇండియా బౌలర్లలో అర్షదీప్​, హార్దిక్​ పాండ్యా చెరో రెండు వికెట్ల తీయగా.. షమీ ఒక వికెట్​ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ (2) విఫలం కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50) ఫామ్‌ అందిపుచ్చుకొని అర్ధశతకం సాధించాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (64*: 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో అశ్విన్‌ (13: 6 బంతుల్లో సిక్స్‌, ఫోర్) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్‌ (30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news