ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై భార‌త్ గెలుపు.. వ‌న్డే సిరీస్ కైవ‌సం..

-

పూణెలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ గెలుపొందింది. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగగా అందులో భార‌త్ విజయం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 330 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ ఛేదిస్తుంద‌ని భావించారు. దీనికి తోడు భార‌త ఫీల్డ‌ర్లు ప‌లుమార్లు కీల‌క క్యాచ్‌ల‌ను కూడా వ‌దిలేశారు. దీంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ మ్యాచ్‌లో అనూహ్యంగా వికెట్లు ప‌డ‌డంతో భార‌త్ ఇంగ్లండ్‌పై 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 2-1 తేడాతో వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది.

india won by 7 runs against england in 3rd odi

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో భార‌త్ 48.2 ఓవ‌ర్ల‌లో 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో రిష‌బ్ పంత్ (78 ప‌రుగులు), శిఖ‌ర్ ధావ‌న్ (67), హార్దిక్ పాండ్యా (64)లు రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయ‌గా, ఆదిల్ ర‌షీద్‌ 2 వికెట్లు ప‌డగొట్టాడు. శామ్ కుర్రాన్‌, రీస్ టాప్లీ, బెన్ స్టోక్స్‌, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 322 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో శామ్ కుర్రాన్ అద్భుతంగా రాణించాడు. 83 బంతులు ఆడిన శామ్ 9 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 95 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డేవిడ్ మ‌ల‌న్ అర్ధ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. భార‌త బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, భువనేశ్వ‌ర్ కుఆర్ 3, టి.న‌ట‌రాజ‌న్ 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news