ఐపీఎల్ 2023: SRH తో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టుగా రికార్డ్… !

-

ఐపీఎల్ లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇందులో హైదరాబాద్ జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ తాత్కాలికమే అని చెప్పాలి. ఎందుకంటే ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ గెలిచినా మ్యాచ్ లు 7 మాత్రమే అవుతాయి, అయినా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు లేవు. కానీ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 18 పాయింట్ లతో ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఇక అన్ని విభాగాలలో ఫుల్ ఫామ్ లో ఉన్న గుజరాత్ కు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఈజీ.

గత మ్యాచ్ లో భారీ స్కోర్ ను చేధించే క్రమంలో ఓటమి పాలయింది, లేకపోతే ఆ మ్యాచ్ లోనే గెలిచి ఉంటే సగర్వంగా ప్లే ఆఫ్ కు వెళ్ళేది. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచి ప్లే ఆఫ్ కు చేరుకుతుంటుందా లేదా మరో మ్యాచ్ వరకు ఆగాల్సిందేనా.

Read more RELATED
Recommended to you

Latest news