కర్ణాటక సీఎం ఆ ఇద్దరిలో ఎవరో చెప్పేసిన కాంగ్రెస్ సీనియర్ నేత !

-

ఈ రోజు కర్ణాటక రాష్ట్రానికి సీఎంగా ఎవరు కానున్నారు అన్న విషయం తెలియనుంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హై కమాండ్ సీఎం ను ఎన్నుకునే ప్రక్రియను స్టార్ట్ చేసింది. కాగా తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జి సెక్రటరీ మరియు సీనియర్ నేత శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం కావడానికి రేస్ లు డీకే శివకుమార్ మరియు సిద్దరామయ్యలు ఉన్నారు. ఇద్దరూ సీఎం పదవికి అర్హులని చెప్పగలము. ఒకరు తనదైన దూకుడు స్వభావంతో పార్టీని ముందుకు నడిపించగా.. మరొకరు సీఎంగా ఉన్న కాలంలో కర్ణాటకకు అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించారు అన్నారు.

 

కాగా ఇప్పటికే వీరిద్దరిలో సీఎం ఎవరు కావాలన్న అభిప్రాయాలను ఎమ్మెల్యేల నుండి సేకరించామని… అయితే ఇద్దరి విషయంలో పార్టీ పాజిటివ్ గా ఉన్నప్పటికీ రాష్ట్ర పరిస్థితులు మరియు భవిష్యత్తు అన్నటినీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం సీఎం ను ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news