చెన్నై సూపర్ కింగ్స్ కి మరో షాక్…!

గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో “తదుపరి రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం అవుతాడు అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. శనివారం ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రావో లేకపోవడంతో సామ్ కుర్రాన్ ముందుకు వచ్చాడని అతను మంచి ప్రదర్శన చేసాడని అన్నాడు.

ఈ రోజు సామ్ కుర్రాన్ యొక్క ప్రదర్శన చాలా సానుకూలంగా ఉంది, అందుకే మేము అతనిని కొన్నామని చెప్పాడు. డ్వేన్ ఆరోగ్యంగా ఉంటే, కుర్రాన్ అస్సలు ఆడలేదా అనే దానిపై టాస్-అప్ ఉండేదని చెప్పాడు. అతను ఈ అవకాశాన్ని రెండు చేతులా తీసుకుని మాపై ఒత్తిడి తీసుకుని వచ్చాడని చెప్పుకొచ్చాడు. బంతితో 6 బంతుల్లో 18 పరుగులు చేశాడు.