శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. డిజిల్, పెట్రోల్, గ్యాస్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు వ్యతిరేఖంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మాజీ స్టార్ క్రికెటర్ అర్జుణ రణతుంగ కీలక సూచన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు వెనక్కి వచ్చేయాలని… దేశాని మద్దతుగా నిలవాలని కోరతున్నాడు. ఆర్ధికంగా కూరుకుపోయిన శ్రీలంకకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఐపీఎల్ లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్ల ఎవరో అందరికి తెలుసని…వారి పేర్లను చెప్పదలుచుకోలేదని అన్నారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మాట్లాడరని.. ఎందుకంటే క్రికెట్ బోర్డ్ కూడా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కిందే పనిచేస్తుందని అన్నారు. క్రికెటర్లంతా వారి జాబ్ లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు సొంత వ్యాపారం వదిలిపెట్టి ముందుకు వచ్చే ధైర్యం చేయాలని సూచించాడు. యువ క్రికెటర్ల ఒకడుగు ముందుకు వేసి ప్రజల నిరసనలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు వనిందు హసరంగ, భానుక రాజపక్సే ప్రజల నిరసనలకు మద్దతు ఇచ్చారు.