మంత్రి పదవి రాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదని.. ఎక్కడ ఉండమంటే అక్కడుంటానని చెప్పారు. కేబినెట్ కూర్పు అంత సులువేం కాదని.. కేబినెట్ కూర్పు సీఎం విచక్షణాధికారమన్నారు. కేబినెట్లో ఉండాలి అని నన్ను అందరూ అడిగారు.. సీఎం కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు.
అంత చీప్ నా కొడుకులు.అని నేను అనచ్చా… అచ్చెం నాయుడు జరిగినవి సింహావలోకనం చేసుకోవాలని ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెం నాయుడు చూసుకోవాలని చురకలు అంటించారు. యనమల ఎవరు మాకు చెప్పడానికి.. సీఎం జగన్ కి తెలుసు ఏం నిర్ణయించాలో..?
కళింగ కమ్యూనిటీ నుంచీ నేను శాసన సభాపతిగా ఉన్నాను.. చాలదా..? మాకు లేని బాధ మీకేమయ్యా..?అని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ను రక్షించుకోవాల్సిన కర్తవ్యం అణగారిన వర్గాల మీద ఉంది.. పార్టీకోసం పని చేయమంటే చేస్తాఅన్నారు. సహజంగానే ఆశావహులు ఉంటారు… ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చిందని తెలిపారు. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా పోతాయని వెల్లడించారు. నాకు కేబినెట్లో అవకాశం ఇస్తారని నేను ఏనాడూ అనుకోలేదు.. బీసీ వర్గానికి చెందినవాడిగా ఇది ఒక గొప్ప కేబినెట్ అంటున్నానని స్పష్టం చేశారు.