కేకేఆర్ విజయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమోషనల్

-

ఐపీఎల్ -2024లో మొదటి నుంచి నిలకడ ప్రదర్శన చూపిస్తూ ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కైవసం చేసుకుంది. మరోవైపు మొదటి నుంచి సంచలనాలు నమోదు చేసిన హైదరాబాద్‌ మాత్రం ఆఖరి పోరులో చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యంతో కప్పును కోల్‌కతాకు కట్టబెట్టింది. నైట్‌రైడర్స్‌ ఆటతీరుపై క్రీడా, రాజకీయ, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేకేఆర్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు బెంగాల్‌ వ్యాప్తంగా సంబురాలు తీసుకొచ్చిందని ఆమె అన్నారు. ఐపీఎల్‌లో రికార్డు బ్రేకింగ్‌ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో పాటు ఇతర స్టాఫ్‌, ఫ్రాంచైజీకి నా శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఏళ్లలో మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

 

‘‘మూడో ఐపీఎల్‌ టైటిల్ సాధించిన కేకే రైడర్స్‌కు అభినందనలు. షారుక్‌ ఖాన్‌ చెప్పినట్లు.. మనమేదైనా మనఃస్ఫూర్తిగా కోరుకుంటే.. దాన్ని నెరవేర్చేందుకు ఈ యావత్‌ ప్రపంచం మనతో కలిసి నడుస్తుందని నిరూపించారు. ఫీల్డ్‌లో జట్టును అద్భుతంగా నడిపించినందుకు, సరైన ప్రణాళికలు అమలు చేసినందుకు శ్రేయస్‌ అయ్యర్‌కు ప్రత్యేక అభినందనలు. గతంలో నెహ్రా, ఇప్పుడు గౌతమ్ గంభీర్‌ మెంటార్‌లుగా విజయం సాధించారు. వారి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news