ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి పాలైంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో ఓడింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజారత్ టైటాన్స్ పై చేయి సాధించింది. చెన్నై విధించిన 170 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ అతి కష్టంగా చేధించింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లు.. సాహా (11), శుభమాన్ గిల్ (0), విజయ్ శంకర్ (0), అభినవ్ మనోహర్ (12), రాహుల్ తేవాటియా (6) వరుసగా ఐదుగురు విఫలం అయ్యారు.
కానీ డేవిడ్ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్) చెన్నైకి శాపంగా మారాడు. కిల్లర్ ఇన్నింగ్స్ తో చెన్నైకి మ్యాచ్ ను దూరం చేశాడు. మిల్లర్ కు తోడుగా రషీద్ ఖాన్ (40) రాణించాడు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది. చెన్నై బౌలర్లు.. బ్రావో 3, తిక్షణ 2 వికెట్లు పడగొట్టారు. అలాగే జడేజా, ముఖేష్ చౌదరీ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డేవిడ్ కు దక్కింది.