ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం ముంబైలోని డీ వై పాటీల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ చిత్తు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ లక్నో సూపర్ జెయింట్స్ రాణించింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో సూప్ జెయింట్స్ ఓడించింది. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓనెనర్లు కెఎల్ రాహుల్ (24), డి కాక్ (80) శుభారంభాన్ని ఇచ్చారు.
డి కాక్.. 52 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు. తొలి వికెట్ కు వీరు 73 పరుగులను జోడించారు. చివర్లో కృనల్ పాండ్య (19 నాటౌట్), ఆయూశ్ బదోని ( 3 బంతుల్లో 10) వేగంగా పరుగులు చేశారు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. కాగ ఈ మ్యాచ్ లో 80 పరుగులతో విధ్వంసం సృష్టించిన డి కాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.