క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..జనమే తేల్చుకోవాలి.!

-

క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ రెండు మాటల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది..అసలు ఈ రెండు మాటలు ఏంటి..ఈ వార్ ఏంటి అని మాట్లాడుకునే వారు ఉన్నారు. కొందరికి ఇవి అర్ధం కూడా కావడం లేదు. కానీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలనేది విధంగా ఇటు జగన్, అటు చంద్రబాబు చూస్తున్నారు. ఎవరికి వారు అధికారం కోసం సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు.

మొదట క్లాస్ వార్ గురించి మాట్లాడుకుంటే..జగన్ ఈ పదం ఎక్కువ వాడుతున్నారు. ఏ సభలో చూసిన ఈ మాట చెబుతున్నారు. అంటే తాను సంక్షేమం అందిస్తున్నానని, తాను మళ్ళీ వస్తేనే కొనసాగుతుందని, చంద్రబాబు వస్తే ఆగిపోతుందని అంటున్నారు. ఇక పేదలకు మేలు చేయడానికే తాను సంక్షేమం ఇస్తున్నానని చెబుతున్నారు. కానీ దాన్ని చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అంటే ఇదొక క్లాస్ వార్ అని..పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారు. పేదల పక్షాన జగన్..పెత్తందార్ల పక్షాన బాబు ఉన్నారని అర్ధం.

ఇక చంద్రబాబు వచ్చి జగన్‌కు కౌంటరుగా కొత్త మాట తెచ్చారు. క్యాష్ వార్ అని అంటున్నారు. అంటే జగన్ అధికారంలోకి వచ్చి..వేల కోట్లు దోచేశారని…జగన్, వైసీపీ నేతల వద్ద కోట్లు ఉన్నాయి..వాటితో ఇప్పుడు ఓట్లు కొంటారని..వారిని తిరస్కరించాలని బాబు ప్రజలకు చెబుతున్నారు.

అంటే క్యాష్ ఉన్న జగన్, వైసీపీ నేతలు ఒకవైపు..క్యాష్ లేని ప్రజలు మరోవైపు ఉన్నారని అంటున్నారు..అందుకే ఇది క్యాష్ వార్ అంటున్నారు. ఇలా ఇద్దరు నేతలు తమదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. మరి వీటిల్లో దేన్ని ప్రజలు నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news