ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ నుంచి కొత్తగా రెండు ఫ్రొంఛైజీలు ఎంట్రీ ఇస్తున్నాయి. అందులో ఉత్తర ప్రదేశ్ నుంచి లక్నో సూపర్ జాయింట్స్ అనే ఫ్రొంఛైజీ కూడా ఒక్కటి. ఈ లక్నో ఫ్రొంఛైజీని సంజీవ్ గోయెంకా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగ ఈ జట్టు.. ఐపీఎల్ వార్ కు సిద్ధం అవుతుంది. కాగ ఈ ఫ్రొంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా, మెంటర్ గౌతం గంభీర్.. ఫ్రొంఛైజీ మొదటి బ్యాట్ ను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగీ ఆదిత్య నాథ్ కు బహుకరించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫోటోలను విడుదల చేసింది. తమ జట్టుకు యూపీ సీఎం యోగి మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కాగ ఇటీవల జరిగిన మెగా వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ ఫ్రొంఛైజీ అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో.. అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, క్వింటన్ డికాక్, మార్క్ వుడ్, జాసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. దీనికి ముందు కెఎల్ రాహుల్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ ను ఎంచుకుంది.
The first bat of the #LucknowSuperGiants presented to the Honorable Chief Minister, @myogiadityanath. Grateful to receive his support! 🏏 pic.twitter.com/SDmRLMa7Sw
— Lucknow Super Giants (@LucknowIPL) February 18, 2022