ఐపీఎల్: చెన్నై vs రాజస్తాన్.. చిత్తుగా ఓడిన రాజస్తాన్..

-

ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై జట్టు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 188పరుగులు చేయగలిగింది. 189పరుగుల లక్ష్యంతో బరిలోఖి దిగిన రాజస్తాన్ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 30పరుగుల వద్ద వోహ్రా నిష్క్రమించగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ సాంసన్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఓపెనర్ గా వచ్చిన జోస్ బట్లర్ ఒక్కడే 49పరుగులు చేసి రాజస్తాన్ రాయల్స్ కి ఒక డీసెంట్ స్కోరు అందించాడని చెప్పవచ్చు. 87పరుగుల వద్ద బట్లర్ ఔటవగానే ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతూనే ఉన్నారు. మొత్తానికి 20ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి
143 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ కి విజయం ఇచ్చేసింది.

స్కోరు విషయానికి వస్తే,

చెన్నై బ్యాట్స్ మెన్లలో డుప్లెసిస్ 33పరుగులు (17బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), అంబటి రాయుడు 27పరుగులు (17బంతుల్లో 3సిక్సర్లు), మొయిన్ 26పరుగులు (20బంతుల్లో 1ఫోరు, 1సిక్సర్), డీజే బ్రావో 20పరుగులు (8బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) చేసారు. రాజస్తాన్ బౌలర్లలో చేతన్ సాకరియా 3వికెట్లు, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్, తెవాటియా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

రాజస్తాన్ బ్యాటింగ్ లో, జోస్ బట్లర్ 49పరుగులు (35బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), రాహుల్ తెవాటియా 20పరుగులు (15బంతుల్లో 2సిక్సర్లు), జయదేవ్ ఉనద్కత్ 24పరుగులు (17బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్), శివమ్ దూబె 17పరుగులు (20బంతుల్లో 2ఫోర్లు) చేసారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3వికెట్లు, రవీంద్ర జడేజా 2వికెట్లు, సామ్ కరేన్ 2వికెట్లు, శార్దూల్ ఠాకూర్, బ్రావో తలా ఒక వికెట్ తీసుకున్నారు. తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news