నేడు ముంబయి Vs గుజరాత్‌ మ్యాచ్​.. చెన్నైని ఢీ కొట్టేదెవరో?

-

ఐపీఎల్​ 16వ సీజన్​లో నేడు క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఫైనల్స్‌ బెర్తు కోసం ఇవాళ గుజరాత్‌తో ముంబయి జట్టు తలపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. లీగ్‌ దశలో 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన టైటాన్స్‌.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలవ్వగా.. ఎనిమిది విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబయి ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై అద్భుత విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్స్​లో స్థానం కోసం తలపడుతున్నాయి. ఇవాళ జరగనున్న మ్యాచ్​లో ముంబయి బ్యాటర్లకు, గుజరాత్‌ బౌలర్లకు మధ్య రసవత్తర పోరు ఖాయం. మరి ముంబయి ఏడో సారి టైటిల్‌ పోరు చేరుతుందా? లేదా టైటాన్స్‌ వరుసగా రెండో సారి ఆఖరి సమరానికి సై అంటుందా? అన్నది వేచి చూడాల్సిందే.

తుది జట్లు (అంచనా):
ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్​, ఇషాన్‌, కామెరున్​ గ్రీన్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, జోర్డాన్‌, షోకీన్‌/నేహాల్‌, ఆకాశ్‌, చావ్లా, బెరెన్‌డార్ఫ్‌.

గుజరాత్‌ టైటాన్స్‌: విజయ్‌ శంకర్‌, సాహా, హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్​, మిల్లర్‌, సుదర్శన్‌/అభినవ్‌ మనోహర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాతియా, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ, షమి

Read more RELATED
Recommended to you

Latest news