‘వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’.. గౌతమ్ గంభీర్‌ పోస్ట్‌ వైరల్

-

ఐపీఎల్‌ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నెట్టింట ఈ టీమ్కు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. #IPL2024ChampionkKR హ్యాష్ ట్యాగ్ నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ జట్టుకు దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఘనవిజయం దక్కింది. ఇందులో ఈ జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ది కీలక పాత్ర. ఆటగాళ్లతో పాటు క్రీడా ప్రముఖులూ అదే చెబుతున్నారు.

కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినా.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే. అతడొచ్చిన తర్వాత జట్టు తీరే మారిపోయింది. ఈ సందర్భంగా గంభీర్‌ ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. ‘‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’’ అంటూ హిందీలో చేసిన తాత్వికతతో కూడిన పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news