IPL 2022 : KKR పై చిత్తుగా ఓడిన హైదరాబాద్…ఫ్లే ఆఫ్స్ ఛాన్స్ గల్లంతు

-

హైదరాబాద్‌ వరుసగా 5వ ఓటమిని చవిచూసింది. కేకేఆర్‌ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌ లో హైదరాబాద్‌ టాప్‌ ఆర్డర్‌ లోని పలుగురు ఆటగాళ్లు టెస్ట్‌ ఆటను తలపించారు. కేకేఆర్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ 43 పరుగులు, మార్‌ క్రమ్‌ 32 పరుగులు మినహా ఏ ఒక్క బ్యాట్స్‌ మెన్‌ రాణించలేదు.

దీంతో హైదరాబాద్‌ 130 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్, 9 పరుగులు, త్రిపాఠి 9 పరుగులు, పూరాన్‌ 2 పరుగులు వాషింగ్టన్‌ సుందర్‌ 3 పరుగులు, శశాంక్‌ సింగ్‌ 11 పరుగులు, మార్కో జాన్‌ సెన్‌ 1 పరుగు చేసి.. దారుణంగా ఫెయిల్‌ అయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌ 3 వికెట్లు, టిమ్‌ సౌథీ 2 వికెట్లు, ఉమేష్‌, వరుణ్‌, సునిల్‌ తలో వికెట్‌ తీశారు. అయితే.. ఈ మ్యాచ్‌ లో హైదరాబాద్‌ ఓడిపోవడంతో.. ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌ లను చేజార్చుకుంది. హైదరాబాద్ కు మరో రెండు మ్యాచ్‌ లు ఉన్నాయి. ఆ రెండింట్లో గెలిచినా… రన్‌ రేట్‌, ఇతర జట్ల పాయింట్ల పై ఆధారపడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news