RCB ప్లేఆఫ్స్​ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్.. వీడియో వైరల్

-

2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిస్టరీ క్రియేట్ చేసింది. సీజన్​లో తొలి 8మ్యాచ్​ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి చేరుకున్న ఈ టీమ్..  ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్​ల్లో వరుసగా అన్నింట్లోనూ విజయం సాధించి ప్లేఆఫ్స్​ రేసులో కీలక జట్టుగా నిలిచింది.  నాకౌట్​కు చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్​లో లక్షలాది మంది అభిమానుల మద్దతుతో, వాతావరణం కూడా సహకరించిన వేళ ఆర్సీబీ శనివారం చిన్నస్వామి స్టేడియంలో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్​పై 27 పరుగుల తేడాతో నెగ్గి సగర్వంగా ప్లే ఆఫ్స్​కు ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించింది.

ఆర్సీబీ విజయంతో ఒక్కసారిగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోపాటు ఆటగాళ్లు, ప్రేక్షకులు, అభిమానులంతా ఎమోషనల్ అయ్యారు. ఎట్టకేలకు ఆర్సీబీ ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టిందని సంబురాలు చేసుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ పీక్స్​లో ఉన్నాయి. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు మీరు చూశారా? ఇదిగో ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news