నల్లగొండకు బయలుదేరిన ఈటల రాజేందర్

-

Etala Rajender : నల్లగొండకు బయలుదేరారు ఈటల రాజేందర్. ఈ రోజు నుండి 22 వ తేదీ వరకు అక్కడే ఉండి “నల్లగొండ – ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ’’ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే నల్లగొండకు బయలుదేరారు ఈటల రాజేందర్.

Etala Rajender who left for Nalgonda

ఇక అటు బీజేపీ కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వెల్లువలా సహకరించి, మమ్ము ఆశీర్వదించి, తమ ప్రేమాభిమానాలను ఓటు రూపంతో తెలియజేసిన వివిధ సంఘాల ప్రతినిధులకు, అభిమానులకు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news