ఉప్పల్​ స్టేడియంలో నేడు SRH Vs PBKS​ మ్యాచ్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

-

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ – పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ  నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు భగాయత్‌ రోడ్డువైపు మళ్లిస్తామని పేర్కొన్న తరుణ్ జోషి.. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఐపీఎల్  2024లో సన్​రైజర్స్ తన​ చివరి మ్యాచ్‌ను ఈరోజు పంజాబ్‌ కింగ్స్​తో  ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఎస్​ఆర్​హెచ్​ గెలిస్తే పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే కోల్‌కతా నైట్​ రైడర్స్​తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లతో మూడో స్థానంలో, 17 పాయింట్లతో హైదరాబాద్‌ రెండో పొజిషన్​లో కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news