ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ కి ఫిదా అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. ఐపీఎల్ 2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.తన బౌలింగ్ కోట పూర్తి చేసిన ఈ యువ కెరటం కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు.తద్వారా క్యాష్ రిచ్ లీగ్ లో ఈ ఘనత సాధించిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
ఉమ్రాన్ మాలిక్ ఆటకు ఆటకు ఫిదా అయిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం ఈ జమ్మూకాశ్మీర్ బౌలర్ ప్రదర్శనను ఆకాశానికెత్తారు.” ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.పదునైన పేస్ తో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.ఈరోజు తన ప్రదర్శన చూసిన తర్వాత ఫైండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఎడిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు” అంటూ కొనియాడారు.అదేవిధంగా..వీలైనంత త్వరగా ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చిదంబరం సూచించారు.అంతే కాదుఅంతేకాదు బీసీసిఐ ఉమ్రాన్ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్ ను నియమించి మరింత రాటుదేలేలా శిక్షణ ఇప్పించాలాని విజ్ఞప్తి చేశారు.