పంజాబ్, ముంబై మ్యాచ్ చూసిన ఆ అమ్మాయి ఎవరు…?

క్రికెట్ చరిత్రలోనే రెండు రోజుల క్రితం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ ఒక సంచలనం అయింది. చరిత్ర చూడని విధంగా ఈ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లను నిర్వహించారు. ముందు స్కోర్లు సమం కాగా ఆ తర్వాత మొదటి సూపర్ ఓవర్ కూడా సమం అయింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్ కూడా ఉత్కంటగా సాగింది. అయితే క్రిస్ గేల్ సిక్స్ కొట్టడం ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 4లు రెండు కొట్టడంతో మ్యాచ్ ఫలితం వచ్చింది.

అయితే మొదటి సూపర్ ఓవర్ సమయంలో ఒక అమ్మాయి కెమెరాకు చిక్కింది. ఆమె అమాయకంగా నోట్లో వేలు పెట్టుకుని మ్యాచ్ చూస్తుంది. అమ్మాయి కూడా బాగుంది అనుకోండి. దీనితో సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్ అయ్యారు. ‘మిస్టరీ గర్ల్’ గా ఆమెను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమె పేరు రైనా లాల్వాని… మిగిలిన వివరాలు ఏమీ వెల్లడి కాలేదు.