మారుతిని వెంటాడుతోన్న హీరో కష్టాలు…!

-

మారుతి కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆస్టాజెనకా కరోనా వ్యాక్సిన్ గనక సెకండ్ ఫేజ్ లో ప్రాబ్లమ్స్ లో పడినట్లు, మారుతి కూడా ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లి డిసప్పాయింట్ అవుతున్నాడు. టాప్ హీరోలు, యంగ్ స్టర్స్ ఇలా ఎవ్వరినీ ట్రై చేసినా వర్కవుట్ కాట్లేదు. దీంతో నెక్ట్స్ ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నాడు మారుతి. లాక్ డౌన్ కి ముందు నుంచీ హీరోల కోసం ట్రై చేస్తున్నాడు మారుతి. కానీ అన్ లాక్ 4.ఓ వచ్చినా మారుతి ప్రయత్నాలకి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. అల్లు అర్జున్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరకు చాలామందితో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినా ఒక్క ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. దీంతో డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడట మారుతి.

‘ప్రతి రోజూ పండగే’ సినిమా తర్వాత మారుతి, అల్లు అర్జున్ కోసం ట్రై చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఈ ట్రైల్స్ వర్కవుట్ కాలేదు. తర్వాత రామ్ తో సినిమా అని టాక్ వచ్చింది. మొన్న బెల్లంకొండతో డిస్కషన్స్ జరిగాయనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు మారుతి. అయితే హీరోలు దొరక్కపోవడంతో కొత్తవాళ్లతో సినిమా నిర్మించాలనుకుంటున్నాడట మారుతి.మారుతి నిర్మాతగా కొన్ని చిన్న సినిమాలు నిర్మించాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేశాడు. అయితే ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఇమేజ్ వచ్చాక నిర్మాణాన్ని తగ్గించి, డైరెక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే మళ్లీ ఇప్పుడు బ్రేక్ రావడంతో నిర్మాణం వైపు అడుగులేస్తున్నాడని తెలుస్తోంది. యూత్ ని అట్రాక్ట్ చేసే వెబ్ సీరీసులు కూడా ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news