ఐపీఎల్ 2021 విజేతపై భారత ప్రధాన కోచ్ జోస్యం

-

దేశంలో కరోనా పరిస్థితులు కిష్టంగా ఉన్నప్పటికీ బయో బబుల్ లో ఐపీఎల్‌ మ్యాచ్ లు విజయవంతంగా, ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్ లు మధ్య దశకు చేరుకుంటున్న సమయంలో బెంగళూరు,చెన్నై, ఢిల్లీ జట్లు తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొలి వరుసగా తొలి మూడు ఉన్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబై జట్టు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. ముంబై జట్టు తిరిగి పుంజుకోవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. ఇక కోల్ కతా, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ చెందిస్తున్నాయి.

అయితే ఐపీఎల్ 2021 విజేతపై భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ఈ ఐపీఎల్ లో కొత్త విజేత అవతరించేందుకు విత్తనాలు నాటుకున్నాయని ట్వీట్ చేసాడు. అయితే మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి ఈ కామెంట్ చేసాడు. ఈ అలానే ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, పంత్ కలిసి ఉన్న ఫొటోనూ ఈ ట్వీట్ కు జత చేశాడు. అంటే ఈ రెండు జట్లలో ఎదో ఒక జట్టు ఐపీఎల్‌ టైటిల్ ను ఎగరేసుకుపోతుందని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

అయితే ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు, ఢిల్లీ జట్లతో పాటు పంజాబ్ జట్టు కూడా ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేదు. ఐపీఎల్ ప్రారంభం అయిన తొలి ఏడాది 2008 లో షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్కసారి కప్పు కొట్టగా… అత్యధికంగా ముంబై ఐదు సార్లు (2013, 2015, 2017 2019, 2020 ), చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు (2010, 2011, 2018), హైదరాబాద్ (డెక్కన్ ఛార్జర్స్ 2009, సన్ రైజర్స్ 2016) రెండు సార్లు కోల్ కతా రెండు సార్లు (2012, 2014) ఐపీఎల్‌ టైటిల్ సాధించాయి. కాగా రవిశాస్త్రి చెప్పినట్లు కొత్త విజేత అవతరిస్తుందా లేక మళ్ళీ పాత జట్లే కప్పు ఎగురేసుకుపోతాయా అని చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news