సౌతాఫ్రిక టూర్ లో ఉన్న టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మూడో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తున్నాడు. అయితే గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మూడో టెస్టుకు దూరం అయ్యాడు. అయితే సిరాజ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. అయితే ఈ స్థానం కోసం ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ పోటీ పడుతున్నారు.
అయితే సిరాజ్ స్థానాన్ని ఇషాంత్ శర్మ భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అందు కోసం టీమిండియా యాజమాన్యం కూడా సుముఖంగా ఉందని సమాచారం. అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇషాంత్ శర్మకే ఓటు వేసినట్టు సమాచారం. అయితే మూడో టెస్టు సౌత్ ఆఫ్రికా లోని కేప్ టౌన్ లో జరుగుతుంది. అయితే కేప్ టౌన్ స్టేడియంలో పిచ్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇషాంత్ శర్మ బౌన్స్ పిచ్ లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. అందు కోసమే టీమిండియా యాజమాన్యం, కోచ్ ద్రావిడ్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఇషాంత్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.