రోహిత్ వల్లే నేను ఇలా ఉన్నా: మయాంక్

-

టెస్ట్ క్రికెట్‌ లో భారత బ్యాటింగ్ లైనప్‌ లో మయాంక్ అగర్వాల్ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ లో ఇప్పటికే తాను ఏంటీ అనేది మయాంక్ నిరూపించుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్‌ లు లేనందున ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ తో జరిగిన వన్డే సిరీస్‌ లో కూడా ఆడాడు. 2019 లో టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో కొంత ఒత్తిడిలో ఉన్న సమయాన్ని ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు.Rohit Sharma, Mayank Agarwal put India on driver's seat after taking India  to 202/0 at tea vs South Africa

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ లో భారత జట్టు ప్రయాణం గత ఏడాది ఆగస్టులో వెస్టిండీస్‌ తో ప్రారంభమైంది. ఈ సీరీస్ లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ కెఎల్ రాహుల్ ఉన్నారు. తాజాగా తన ప్రయాణం గురించి మయంక్ కీలక వ్యాఖ్యలు చేసాడు.”గత సంవత్సరం వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ జట్టులో నా స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కొంచెం ఒత్తిడి ఉన్నట్లు నేను గమనించా. మొదటి టెస్టులో నేను ఎక్కువ పరుగులు చేయలేదు. కాని రోహిత్ ఇచ్చిన సలహాతో నా ఆట తీరు మెరుగు పడిందని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news