నకిలీ వార్తలు, ద్వేషం మరియు హానికరమైన విషయాల వ్యాప్తిని అరికట్టడానికి, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మెసెంజర్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్వార్డింగ్ ను పరిమితం చేసింది. ఇప్పుడు, వినియోగదారులు ఒకేసారి గరిష్టంగా ఐదుగురు లేదా అయిదు గ్రూపులకు మాత్రమే మెసేజ్ ని ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వాట్సాప్ లో ఫార్వార్డింగ్ ఆంక్షలకు అనుగుణంగా ఉంటుందని ఫేస్బుక్ పేర్కొంది.
మెసేజింగ్ లో ఫార్వర్డ్ ల సంఖ్యను పరిమితం చేయడం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రొత్త నిబంధనను బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించిన ఫేస్‌బుక్, “ప్రజలకు సురక్షితమైన, మరింత ప్రైవేట్ సందేశ అనుభవాన్ని అందించే మా ప్రయత్నాల్లో భాగంగా, ఈ రోజు మనం మెసెంజర్‌పై ఫార్వార్డింగ్ పరిమితిని ప్రవేశపెడుతున్నామని పేర్కొంది.