టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన జ‌డేజా

గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియా లో టీమిండియా స్టార్ అలౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గాయం కార‌ణం గా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పె యోచ‌న లో ర‌వీంద్ర జ‌డేజా చెబుతున్నాడ‌ని వార్తలు తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ వార్త ర‌వీంద్ర జడేజా వ‌ద్ద కు చేరింది. దీని పై ర‌వీంద్ర జ‌డేజా ట్విట్ట‌ర్ వేదిక గా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా లో వ‌చ్చేవ‌న్నీ కూడా పుకార్ల ను చిన్న ట్విట్ తో చెక్ పెట్టేశాడు.

ఈ ట్వీట్ లో ర‌వీంద్ర జ‌డేజా.. టెస్ట్ జ‌ర్సీ ని ధ‌రించి ఉన్న ఫోటో ను పోస్ట్ చేశాడు. అలాగే లాంగ్ వే టూ గో అంటూ కామెంట్ ను జ‌త చేశాడు. అంటే ఇంకా చాలా ఉంది అనే అర్థం వ‌చ్చేలా ఆ ఫోస్ట్ ఉంది. కాగ టెస్ట్ క్రికెట్ ను ఇప్పుడే వ‌ద‌లేయ‌ను అనే విధం గా ఈ కామెంట్ పెట్టాడు. కాగ ర‌వీంద్ర జ‌డేజా కు గాయం అవ‌డం తో పాటు అలాగే వ‌న్డేలు, టీ ట్వంటి లపై జ‌డేజా ఫోక‌స్ పెట్ట‌డానికే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడ‌ని వార్తలు వ‌చ్చాయి. కాగ జ‌డేజా త‌న ట్విట్ తో ఈ రుమార్ల కు చెక్ పెట్టేశాడు.