IND vs SL : డిక్లేర్ చేయుమ‌న్న‌ది నేనే.. వివాదానికి పుల్ స్టాప్ పెట్టిన జ‌డేజా

-

టీమిండియా, శ్రీ‌లంక మ‌ధ్య మొద‌టి టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ శ‌నివారం భార‌త తొలి ఇన్నింగ్స్ ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. 574 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేశారు. అయితే ఆ స‌మ‌యంలో స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. 175 ప‌రుగుల వ‌ద్ద అజేయంగా ఉన్నాడు. అయితే ఈ సమ‌యంలో కెప్టెన్ ఎందుకు డిక్లేర్ చేశాడ‌ని అభిమానులు ఫైర్ అయ్యారు. జ‌డేజా మ‌రో 25 ప‌రుగ‌లు 200 మార్క్ ను అందుకును వాడ‌ని.. రికార్డులను బ్రేక్ చేసేవాడ‌ని అభిమానులు అంటున్నారు.

అలాగే జట్టు స్కోరు కూడా 600 మార్క్ అందుకునేద‌ని అంటున్నారు. అయితే జ‌డ్డు 200 స్కోరు చేయ‌కుండా.. రోహిత్ శ‌ర్మ‌నే అడ్డుకున్నాడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో తీవ్ర వివాదమే జ‌రిగింది. అయితే తాజా గా జ‌డేజా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్ ను తానే డిక్లేర్ చేయ‌మ‌ని కెప్టెన్ కు సందేశం పంపించాన‌ని తెలిపారు. త‌న కోరిక మేర‌కే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశార‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం పిచ్ చాలా మారింద‌ని.. బంతి బౌన్స్ అవ‌డం తో పాటు ట‌ర్న్ అవుతుంద‌ని అన్నారు. దాన్ని క్యాచ్ చేసుకోవడానికే డిక్లేర్ చేశామ‌ని అన్నారు. అప్పుడు శ్రీ‌లంక బ్యాట‌ర్లను సులువుగా అల‌స‌ట అయ్యేలా చేయ‌వ‌చ్చ‌ని ప్లాన్ వేసిన‌ట్టు జ‌డ్డు తెలిపారు. కాగ జ‌డ్డు ప్ర‌క‌ట‌నతో ఈ వివాదం ముగిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version