బీసీసీఐ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనుకున్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి నిరాశ ఎదురైంది. ఈ విషయంలో దాదాకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సపోర్ట్ గా వచ్చారు. దాదాను మరోసారి ఐసీసీకి పంపాలని ప్రధాని మోదీని దీదీ రిక్వెస్ట్ చేశారు.
‘గంగూలీ అన్యాయంగా తన పదవిని కోల్పోయారు. ఆయన చేసిన తప్పేంటి? ఈ విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదా ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బెంగాల్ ఒక్కటే కాదు.. భారత్ గర్వించదగ్గ వ్యక్తి. అనుచితంగా ఆయన్ను ఎందుకు తొలగించారు..? గంగూలీ ఐసీసీ ఎన్నిక కోసం పోటీపడేలా అనుమతి ఇవ్వాలని ప్రధానిని అభ్యర్థిస్తున్నాను.’ అని దీదీ పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి రెండోసారి పదవులు చేపట్టొచ్చు. కారణం ఏంటో తెలీదు కానీ.. జై షా కొనసాగుతున్నారు. అసలు గంగూలీ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది..? ఆటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి’ అని మమత పేర్కొన్నారు.