‘యశోద’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యశోద’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘యశోద’ మూవీ రిలీజ్ డేట్ ను ఆ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించారు. హరి, హరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవంబర్ 11న ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కథ, కథనం, నిర్మాణ విలువల్లోనే గాక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా రొటీన్ కి భిన్నంగా ఈ టీమ్ వెళ్తోంది.

”ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘యశోద’. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ‘యశోద’లో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు” అని ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ అన్నారు.

సమంతతో పాటు ఈ మూవీలో ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news