ప్రత్యర్థిని చిత్తు చేసి MLC టైటిల్ ను కొట్టేసిన ముంబై ఇండియన్స్ … !

-

అమెరికాలో గత రెండు వారాలుగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ భారత కాలమానం ప్రకారం కాసేపటి క్రితమే సీజన్ 1 కు తెర పడింది. మొత్తం ఆరు జట్లు హోరా హోరీగా తలపడగా తుది సమరానికి న్యూ యార్క్ ముంబై ఇండియన్స్ మరియు సీటల్ ఆర్కాస్ జట్లు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ పూరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సీటల్ ఆర్కాస్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ డీకాక్ (87) వీరోచితంగా పోరాడి జట్టుకు గౌరవప్రదమైన టార్గెట్ ను అందించాడు. ఇక ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్ తీసి మరోసారి రాణించాడు. ఇక 184 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ మూడవ బంతికే వికెట్ ను కోల్పోయింది.

ఆ తర్వాత నుండి నికోలస్ పూరన్ (137) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ను గెలిపించి ముంబై ఇండియన్స్ కు మేజర్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్ కు టైటిల్ ను అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news