టీమిండియా టూర్ కు రెడీ అవుతున్న న్యూజిలాండ్ టీమ్ ప్ర‌క‌ట‌న‌

-

టీమిండియా తో టూర్ కు న్యూజిలాండ్ సిద్ధం అవుతుంది. న‌వంబ‌ర్ 17 నుంచి ఇండియా లో న్యూజిలాండ్ మూడు టీ ట్వంటి ల తో పాటు మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడ‌నుంది. వీటి కోసం తాజాగా న్యూజి లాండ్ క్రికెట్ బోర్డు జ‌ట్టు ను ప్ర‌క‌టించింది.

ఈ పర్యటనకు లో టెస్టు మ్యాచ్ ల‌కు న్యూజిలాండ్ బౌల‌ర్ లు ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు విశ్రాంతి ఇచ్చారు. అలాగే కేన్ విలియ‌మ్స‌న్ ను రెండు ఫార్మెట్ ల‌కు కెప్టెన్ గా ఉంచారు. కాగ టీమిండియా , న్యూజిలాండ్ రెండు జట్లు కూడా బ‌ల‌మైన జట్లు కావ‌డం తో ఈ టూర్ పై ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. అయితే టీ ట్వంటి ప్ర‌పంచ కప్ లో న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా ఓట‌మి పాల‌యిన విష‌యం తెలిసిందే.

టెస్ట్‌ సిరీస్‌కు  కీవిస్‌ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), డెవాన్ కాన్వే, కైల్ జామీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్

టీ20 సిరీస్‌కు కీవిస్‌ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే

Read more RELATED
Recommended to you

Latest news